schedule Saturday, July 04, 2026

పంది పిల్లకు పాలిచ్చిన ఆవు..!

calendar_today March 14, 2023
person dharshininews
పంది పిల్లకు పాలిచ్చిన ఆవు..!
పంది పిల్లకు పాలిచ్చిన ఆవు..! - జాతి వైరం మరిచి దాహార్తి తీర్చిన గోమాత - మానవత్వం అంటే ఇదేనేమో అంటున్న నెటిజన్లు - సోషల్ మీడియాలో వీడియో హల్ చల్ దర్శిని డెస్క్‌: మనషులతో పాటు జంతువులు కూడ మానవత్వాన్ని ప్రదర్శిస్తాయి. ఎలుకతో పిల్లి స్నేహం, కుక్క పిల్లిపిల్లలకు పాలివ్వడం వంటి సందర్భాలను ఎన్నో చూసే ఉంటాం. అలాంటి దృశ్యాలు ఎప్పటికి ప్రత్యేకమే. ఆకలి ఎవరిదైనా ఒకటే అన్నట్లుగా ఆవు .. పందికి పాలు ఇచ్చి మాతృత్వాన్ని చాటుకుంది. పాలను తాగేందుకు వచ్చిన పందిని చూసి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా తన పాలను పందికి పట్టింది. తాజాగా ఆవు దగ్గర పాలు తాగుతున్న పంది వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఈ వింత ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో జరిగింది. ఆకలితో ఏం చేయాలో తెలియక అటు ఇటు వెతుకుతున్న పందికి సెడన్ గా ఆవు కనిపించింది. వెంటనే ఆవు పొదుగు దగ్గరకు వెళ్లి మూతి పెట్టి దర్జాగా పాలు తాగసాగింది. పంది ఆకలిని గమనించి ఆవు.. కదలకుండా తన జాతికాదని ద్వేషించకుండా ఆకలితో ఉన్న తన బిడ్డకు పాలు ఇస్తుందో అదే రీతిలో పాలు ఇచ్చింది. పందికి పాలు ఇచ్చి మాతృత్వాన్ని చాటుకుంది. ఈఘటనను చూసిన స్తానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆవు మానవత్వం చాటుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మనుషులు సైతం ఆవును ఆదర్శంగా తీసుకోవాలంటూ ప్రశంసించారు. ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. మొబైల్ ఫోన్ లో ఈ సంఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు మానవత్వం అంటే ఇదేనేమో అంటూ గోమాతను మెచ్చుకుంటు కామెంట్లను పెడుతున్నారు. వీడియో కోసం కింద చూడండి.. [video width="640" height="352" mp4="https://dharshininews.com/wp-content/uploads/2023/03/whatsapp-video-2023-03-13-at-90558-pm.mp4"][/video]