schedule Saturday, September 19, 2026

జోడో.. జోరు..!

calendar_today March 14, 2023
person dharshininews
జోడో.. జోరు..!
జోడో.. జోరు..! - తాండూరులో కొనసాగుతున్న కార్యక్రమం - ఇంటింటికి వెళ్లి చేయి చేయి కలిపిన నేతలు - పాల్గొన్న ఎం.రమేష్‌ మహరాజ్, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ భారత అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన హాత్‌ సే హాత్‌ జోడో కార్యక్రమం తాండూరులో జోరుగా కొనసాగుతోంది. మంగళవారం కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని 16,17, 18వ వార్డులలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని జోరుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్, ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మాజీ జెడ్పీటీసీ రాకేష్ మహరాజ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా వార్డులలో నేతలు ఇంటింటికి తిరిగి హత్ సే హాత్ జోడోలో భాగంగా చేయి చేయి కలిపి ప్రజల్లో ఉత్సహాం నింపారు. అనంతరం పలువురు మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పేదలకు ఒరిగిందేమి లేదన్నారు. నిత్యవసర ధరల పెంపుతో ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజల అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్, జనార్దన్ రెడ్డి, నర్సింలు, మాజీ వైస్ చైర్మన్ ఎంఏ అలీం, పి.బస్వరాజ్, జలాల్, సమద్, కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ కార్యదర్శి కావలి సంతోష్‌ కుమార్, పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, నవాజ్, నారా అశోక్, ఖయ్యూం, ఖాలిద్ షఫీ ఉల్లా, నవీన్ తదితరులు పాల్గొన్నారు.