schedule Tuesday, September 08, 2026

రొంపల్లి సంతోష్ చల్లని సేవ..!

calendar_today March 16, 2023
person dharshininews
రొంపల్లి సంతోష్ చల్లని సేవ..!
రొంపల్లి సంతోష్ చల్లని సేవ..! - కంటి చూపు బాధితులకు కూల్ డ్రింక్స్ పంపిణీ - లయన్స్ క్లబ్ విజన్ సెంటర్లో ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు లయన్స్ క్లబ్ కార్యదర్శి రొంపల్లి సంతోష్ కుమార్ వేసవికాలంలో పేదలకు చల్లని సేవ అందించేందుకు సిద్ధమయ్యారు. పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విజన్ సెంటర్ ద్వారా కంటి సమస్యలతో బాధపడే పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు, అవసరమైన వారికి ఆపరేషన్లు చేయిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గురువారం నిర్వహించిన విజన్ సెంటర్లో పేదలు కంటి వైద్య పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ కార్యదర్శి రొంపల్లి సంతోష్ కుమార్ తన సొంత ఖర్చులతో బాధితులకు కోకో కోలా కంపెనీకి చెందిన మాజా ఎనర్జీ కూల్ డ్రింక్స్ లను ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో పాటు ఆపరేషన్ కోసం హైదరాబాద్ కు వెళుతున్న బాధితులకు పండ్లరసాలు (గ్రేప్స్ జ్యూస్) అందజేశారు. మండుతున్న వేసవిలో రొంపల్లి సంతోష్ కుమార్ చల్లని కూల్ డ్రింక్స్ పంపిణీ చేసి చల్లని మనసును చాటుకున్నారు.. చల్లని పానియాలు అందుకున్న బాధితులు రొంపల్లి సంతోష్ నల్లంగా ఉండాలని అభిలాషించారు. విజన్ సెంటర్ లో ఇక నుంచి ప్రతిసారి పరీక్షలకు వచ్చేవారికి ఉచితంగా తన సొంత ఖర్చులతో కూల్స్ డ్రింక్స్ అందిస్తానని లయన్స్ క్లబ్ కార్యదర్శి రొంపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. మరోవైపు గురువారం నిర్వహించిన కంటి పరీక్షల్లో 19 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించి హైదరాబాద్ కు తరలించడం జరిగిందని తెలిపారు.