దంచికొట్టిన వానకు కంపుకొట్టిన తాండూరు
March 18, 2023
dharshininews
దంచికొట్టిన వానకు కంపుకొట్టిన తాండూరు
- రోడ్లపైకి వచ్చిన మురుగు వ్యర్ధాలు
- దుర్గంతో ఇబ్బందులు పడ్డ పట్టణ వాసులు
- మున్సిపల్ కార్మికులు ఏం చేశారంటే...?
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈ వేసవి కాలంలో కురుస్తున్న ఆకాల వర్షాలతో రైతులతో పాటు పణ్ణణ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు రోజుల నుంచి అకాల వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం రాత్రి తాండూరులో కురిసిన భారీ వర్షం కారణంగా పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత తాండూరులో వర్షం దంచికొట్టింది. తెల్లవారే - సమయానికి ముందు వర్షం తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో భారీ ఉరుములు, మెరుపుల శబ్దాలతో కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతలు జలమయం కాగా.. మురుగుకాలువలు పొంగిపొర్లాయి. రహదారులు అన్ని గోదారులు అయ్యాయి. మురుగు కాలువలు పొంగిపొర్లడంతో కాలువల్లో పేరుకుపోయిన మురుగు వ్యర్థాలు, చెత్త చెదారం రోడ్లపైకి వచ్చేసింది. ఉదయం ప్రజలు బయటకు వచ్చే చూసేసరికి రోడ్లన్నీ దుర్గందంగా తయారయ్యాయి. రోడ్లపైకి వచ్చిన దుర్గందం పట్టణ వాసుల ముక్కుపుటలను ఆదరగొట్టింది. వివిధ పనుల నిమిత్తం వెళ్లే వాహనదారులు, పాదాచారులు కంపుతో ఇబ్బందులు పడ్డారు. రాకపోకలకు అవస్థలు ఎదుర్కొన్నారు. మరోవైపు శనివారం ఉదయం నుంచి విధుల్లో చేరిన మున్సిపల్ కార్మికులు మురుగుకాలువలు, రోడ్లను శుభ్రం చేశారు. అయినా రోడ్లపై దుర్గందం మరకలు దర్శనమిచ్చాయి. రోడ్లపై దర్శనమిచ్చిన చెత్త చెదారం, మురుగు వ్యర్థాలతో పట్టణ వాసులు మున్సిపల్ పారిశుద్ధ్య నిర్వహణపై విమర్శలు చేశారు.