schedule Saturday, July 04, 2026

అల్లా అందరికి శక్తి, సామర్థాలు ప్రసాదించాలి

calendar_today March 19, 2023
person dharshininews
అల్లా అందరికి శక్తి, సామర్థాలు ప్రసాదించాలి
అల్లా అందరికి శక్తి, సామర్థాలు ప్రసాదించాలి - రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభఫ్రద్ పటేల్ - తాండూరులో రంజాన్ ఉపవాస దీక్ష క్యాలెండర్‌ ఆవిష్కరణ తాండూరు, దర్శిని ప్రతినిధి: అల్లా ముస్లిం సోందరులందరికి సుఖఃసంతోషాలు, శక్తి సామార్థ్యాలను ప్రసాధించాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ ఆకాంక్షించారు. ఆదివారం తాండూరులో రంజాన్‌ ఉపవాస దీక్షలకు సంబంధించి రూపొందించిన క్యాలెండర్‌ను శుభప్రద్ పటేల్ ముస్లిం పెద్దలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు ముందుగానే రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ పవిత్రతకు, త్యాగానికి చిహ్నమని, పండుగను భక్తి శ్రద్దలతో ఆనందోత్సవాలతో జరుపుకోవాలన్నారు. నెల రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో నియామ నిష్ఠలతో ఉపవాస దీక్షలు చేపడతారని తెలిపారు. ఉపవాసాలు ఉంటున్న అందరకీ అల్లా మంచి శక్తి సామర్థ్యాలు కల్పించాలని శుభప్రద్ పటేల్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ మైనార్టీ సీనియర్ నాయకులు ఆబిద్ చౌష్, షేక్ ఫరీద్, మహమ్మద్ యూసుఫ్, హనీఫ్, వహీద్, మస్తాన్, మరియు శుభప్రద్ యువసేన సభ్యులు భానుప్రసాద్, కుర్వబాలు, శ్రీశైలం, విజయ్, హరీష్, మురళి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.