schedule Sunday, July 05, 2026

ప్రజావాణిలో ఆరు ఫిర్యాదులు

calendar_today March 20, 2023
person dharshininews
ప్రజావాణిలో ఆరు ఫిర్యాదులు
ప్రజావాణిలో ఆరు ఫిర్యాదులు - పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం - మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 6 ఫిర్యాదులు అందించనట్లు మేనేజర్ నరేందర్ రెడ్డి తెలిపారు. వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు వరుసగా మూడో వారం ప్రజావాణి నిర్వహించారు. సోమవారం కార్యాలయంలో ఉదయం 10-30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజావాణి కొనసాగింది. మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ రంగనాథంలు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. నిర్ణీయ సమయం వరకు మొత్తం 6 ఫిర్యాదులు అందినట్లు మేనేజర్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఇందులో 5 ఆసరా ఫించన్లు సంబంధిచిన ఫిర్యాదులు అందగా.. మిగతా ఒక్కటి టౌన్‌ ప్లానింగ్‌కు సంబంధించి ఫిర్యాదు అందిందని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత విభాగాలకు పంపించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు ప్రతివారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిని పట్టణ వాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పట్టణంలోని పారిశుద్ధ్యం, తాగునీరు, టౌన్‌ ప్లానింగ్ సమస్యలు, ఆసరా ఫించన్లు, బర్త్‌ అండ్ డెర్త్‌ సర్టిఫికెట్ సమస్యలపై ఫిర్యాదులు చేసుకోవాలని సూచించారు. సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, ఇంజనీరింగ్ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించడం జరగదని స్పష్టం చేశారు.