schedule Sunday, September 06, 2026

ఈ వస్తువులుంటే ఉగాది రాజయోగమే..!

calendar_today March 21, 2023
person dharshininews
ఈ వస్తువులుంటే ఉగాది రాజయోగమే..!
ఈ వస్తువులుంటే ఉగాది రాజయోగమే..! - వాటిని ఇంటికి తెచ్చుకుంటే అంతా అదృష్టం - ఆ వస్తువులు ఏంటో మీరు తెలుసుకోండి హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: రేపటి నుంచి తెలుగు సంవత్సరం ఉగాది ప్రారంభం కాబోతుంది. ప్రతి యేడాదిలాగానే ఈ యేడాది కూడా ఇంటికి కొత్త వస్తువులు తెచ్చుకుంటే రాజయోగం సిద్దిస్తుందని వాస్తు పండితులు పేర్కొంటున్నారు. ఉగాది రోజు కొత్తగా 6 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం వరించడంతో పాటు డబ్బులకు కొరత రాకుండా ఉంటుందని చెబుతున్నారు. చైత్ర మాసం శుక్ల పక్షం ప్రతిపద తిథి నాడు బ్రహ్మా విశ్వాన్ని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. హిందువులు కొత్త సంవత్సరం రోజున ఇంట్లో కొన్ని వస్తువులను తీసుకువస్తే, అది చాలా పవిత్రమైనదిగా, శుభప్రదంగా పరిగణిస్తారు. కాబట్టి, హిందూ నూతన సంవత్సరం రోజున ఇంట్లోకి కొన్ని వస్తువులను తీసుకురావడం వల్ల మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. అయితే ఉగాది రోజు ఇంటికి ఎలాంటి వస్తువులను కొనుగోలు చేసి తీసుకురావాలో తెలుసుకుందాం. తులసి మొక్కతో శుభయోగం హిందూ నూతన సంవత్సరం సందర్భంగా, తులసి మొక్కను ఇంటికి తీసుకురండి. దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఇంటి సానుకూలత చెక్కుచెదరకుండా ఉంటుంది. ఉగాది రోజున తులసీకి పూజలు చేయడం వల్ల అంతా మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. ధన లోటు తీర్చే చిన్న కొబ్బరికాయ ఇంట్లోకి చిన్న కొబ్బరికాయను తీసుకవచ్చి ఉంచడం వల్ల సుఖశాంతులు నిలవడమే కాకుండా ధనానికి కూడా ఎలాంటి లోటు ఉండదు. ఒక చిన్న కొబ్బరికాయను ఇంటికి తెచ్చి ఆ కొబ్బరికాయను ఎర్రటి గుడ్డలో చుట్టి బీరువాలో ఉంచండి. లోహపు తాబేలు ఉగాది పర్వదినాన లోహపు తాబేలును ఇంట్లోకి తీసుకురావడం వల్ల సానుకూల శక్తి ప్రసారమవుతుంది. దుష్ట శక్తులను కూడా నాశనం చేస్తుంది. దీంతో ఇంట్లో ఆనందం, శాంతి కూడా నెలకొంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. లాఫింగ్ బుద్ధని తీసుకురండి ఉగాది రోజున ఇంట్లోకి లాఫింగ్ బుద్ధని తీసుకురండి. దీనిని ఈశాన్య దిశలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. ముత్యాల శంఖం ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ధనం ఉంటుంది. శంఖువు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఉగాది రోజు ముత్యాల శంఖుని కొనుగోలు చేయండి. ఇంట్లోకి తెచ్చి పూజ చేసిన తర్వాత డబ్బు పెట్టే చోట ఉంచాలి. ఇది పురోగతికి అన్ని మార్గాలను తెరుస్తుంది. డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు.  నెమలి ఈక  ఏ ఇంట్లో నెమలి ఈక ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది. హిందూ నూతన సంవత్సరానికి ముందు ఇంట్లోకి మూడు నెమలి ఈకలను తీసుకురండి. (Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..)