schedule Sunday, July 05, 2026

కట్ట మైసమ్మ దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు

calendar_today March 21, 2023
person dharshininews
కట్ట మైసమ్మ దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు
కట్ట మైసమ్మ దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు - తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ - భక్తులకు అన్నదానం చేసిన ఏఎంసీ చైర్మన్ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం ఆదర్శనగర్ కట్ట మైసమ్మ దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు అందించడం జరుగుతుందని మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. మంగళవారం అమవాస్య సందర్భంగా ఆదర్శనగర్‌లో వెలసిన శ్రీ కట్ట మైసమ్మ ఆలయంలో వెలసిన అమ్మవారిని విఠల్ నాయక్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొని కమిటి సభ్యులతో కలిసి భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా శ్రీ కట్ట మైసమ్మ దేవాలయం వద్ద ప్రతి అమావాస్యకు భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి తనవంతుగా రూ.25 లక్షల ఆర్థిక చేయూతనందిచడం జరుగుతుందన్నారు. ఆలయాభివృద్ధి కోసం తోడ్పాటు అందిస్తామని అన్నారు. దీంతో పాటు వచ్చే జులైలో జరిగే అమ్మవారి జాతర ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు సహకారం అందించడం జరుగుతుందన్నారు. అమ్మవారి ఆలయ నిర్మాణం కోసం నేతలు, ప్రముఖులు విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి అధ్యక్షులు సుధాకర్, ప్రధాన కార్యదర్శి మెకానిక్ సుధాకర్, సహాయ కార్యదర్శి వేణుగోపాల్, ముఖ్య సలహాదారు నల్ల పాపయ్య, కమిటి సభ్యులు పట్నం రమేష్, రాజేష్, నర్సింలు, నాగప్ప తదితరులు పాల్గొన్నారు.