schedule Sunday, July 05, 2026

తాండూరు సమస్యలపై పోరాటం

calendar_today March 26, 2023
person dharshininews
తాండూరు సమస్యలపై పోరాటం
తాండూరు సమస్యలపై పోరాటం - రేపు బీజేపీ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష - పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నెలకొన్న సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రేపు సోమవారం తాండూరు గోస - బీజేపీ భరోసా కార్యక్రమం కింద పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఒకరోజు దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు. ఉదయం 10-30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగుతుందని తెలిపారు. తాండూరు మున్సిపల్లో మున్సిపల్ సమావేశాలు సక్రమంగా నిర్వహించి సమస్యలు పరిష్కారించాలని, కార్యాలయంలో ఉన్న వివిధ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రకటించిన ప్రతి వార్డుకు రూ.1 కోటి రూపాలు మంజూరు చేయాలని, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దీక్ష జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, ఇంచార్జిలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కౌన్సిలర్లు హాజరవుతున్నారని తెలిపారు. అందరు పాల్గొని దీక్షను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.