schedule Tuesday, September 08, 2026

రేపు మటన్‌ షాపులు బంద్‌

calendar_today March 29, 2023
person dharshininews
రేపు మటన్‌ షాపులు బంద్‌
రేపు మటన్‌ షాపులు బంద్‌ - హోటల్స్‌లో కూడ విక్రయాలకు బ్రేక్ - నోటీసులు అందించిన మున్సిపల్ అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు మున్సిపల్ పరిధిలో ఉన్న మటన్‌ షాపులను బంద్ చేయాలని అధికారులు సూచించారు. రేపు శ్రీరామ నవమి సందర్భంగా విక్రయాలు నిలిపి వేయాలని నోటీసులు జారీ చేశారు. బుధవారం తాండూరు ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది పట్టణంలోని మటన్, చికెన్ షాపులతో పాటు చేపల వ్యాపారులకు నోటీసులు అందించారు. దీంతో పాటు నాన్ వెజ్ హోటల్‌, రెస్టారంట్లకు కూడ నోటీసులు అందజేశారు. మేకలు, కబేలా షాపులు సైతం మూసిఉంచాలని అన్నారు. గురువారం శ్రీరామ నవమి సందర్భంగా రోజు మొత్తం ఎలాంటి మాంసం విక్రయాలు చేపట్టరాదని సూచించారు. నోటీసు నిబంధనలను అతిక్రమిస్తే చట్టరిత్య చర్యలు తప్పవని హెచ్చరించారు.