schedule Sunday, July 05, 2026

ఇఫ్తార్‌ మతసామరస్యానికి ప్రతీక

calendar_today April 16, 2023
person dharshininews
ఇఫ్తార్‌ మతసామరస్యానికి ప్రతీక
ఇఫ్తార్‌ మతసామరస్యానికి ప్రతీక - ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి - ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు తాండూరు, దర్శిని ప్రతినిధి : హిందూ, ముస్లింల మతసామరస్యతకు ప్రతీకగా రంజాన్‌ ఇఫ్తార్‌ విందులు నిలుస్తాయని చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు అన్నారు. రంజాన్ పండగ సందర్భంగా ఆదివారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు అట్టహాసంగా ఇస్తార్ విందు ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతోకలిసి ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పలహారాలను స్వీకరించి ఉప వాసదీక్షలను విరమించారు. ఈ సందర్భంగా పలువురు ఎంపి, ఎమ్మెల్యేలకు ముస్లిం సోదరులు ఫలహారాలు తినిపించారు. ఎంపీ, ఎమ్మెల్యేలు కూడ ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఇఫ్తార్ విందు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు మత సామరస్యతను చాటుతాయన్నారు. హిందూ ముస్లింలు మత సామరస్యతను పెపొందించడంలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), ముస్లిం పెద్దలు, సోదరులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.