schedule Saturday, July 04, 2026

హెల్మెట్ ధారణపై కొత్త రూల్..!

calendar_today April 18, 2023
person dharshininews
హెల్మెట్ ధారణపై కొత్త రూల్..!
హెల్మెట్ ధారణపై కొత్త రూల్..! - సరిగ్గా ధరించకుంటే జరిమాన తప్పదు - కొత్త రూల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి దర్శిని డెస్క్‌: బైకులు, స్కూటీలు నడిపేవారు ఇకపై జాగ్రత్త పడాల్సిందే. లేదంటే చిక్కులు ఎదుర్కొకతప్పదంటున్నారు అధికారులు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని ఉన్న నిబంధన అందరికి తెలిసిందే. తాజాగా హెల్మెట్ వాడకంపై అధికారులు కీలక నిబంధనలు తీసుకవచ్చారు. హెల్మెట్‌ ధరించామంటే ధరించినట్లు కాదు.. ప్రాపర్‌గా హెల్మెట్‌ ధరించాలని స్పష్టం చేసింది. హెల్మెట్‌లకు సంబంధించి కొన్ని నియమాలు కూడా పాటించాలి. ఈ నిబంధనలను పాటించడంలో విఫలమైతే జరిమానా విధించబడుతుందని తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. మరి హెల్మెట్‌ వాడకంపై వచ్చిన కొత్త నిబంధనలు ఏంటో కింద చది తెలుసుకోండి. హెల్మెట్‌ వాడకంపై నిబంధనలు ఇవే.. 1. నిబంధనల ప్రకారం, హెల్మెట్‌ను ప్రమాదం జరిగినప్పుడు గరిష్ట రక్షణను అందించగల మెటీరియల్‌ని ఉపయోగించి తయారు చేయాలి. దాని ఆకారం మాత్రమే ఇక్కడ చాలా ముఖ్యమైనది. 2. హెల్మెట్ ఉన్నంత మాత్రాన తలకు పెట్టుకుంటే సరిపోదు. రైడర్ ధరించినప్పుడు హెల్మెట్ పట్టీని సరిగ్గా బిగించాలి . హెల్మెట్ ధరించే వ్యక్తి దానిని ధరించాడా లేదా అనేదాని కంటే దానిని ఎలా ధరించాడు అనేదే ముఖ్యం. 3. హెల్మెట్ బరువు 1.2 కిలోల వరకు ఉండాలి. 4. మంచి నాణ్యమైన మెటీరియల్‌తో తయారు చేసిన హెల్మెట్‌ను ఉపయోగించాలి. దాని కనీస మందం 20-25 మిమీ ఉండాలి. 5. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ప్రకారం, హెల్మెట్‌లకు ISI గుర్తు తప్పనిసరి. ఐఎస్‌ఐ గుర్తు లేని హెల్మెట్‌లు ధరించడం, అమ్మడం రెండూ చట్టవిరుద్ధం. 6. హెల్మెట్‌లో పారదర్శకమైన కంటి కవర్‌ను ఉపయోగించాలి. 7. హెల్మెట్ కోసం BIS సర్టిఫికేట్ చాలా ముఖ్యమైనది. 8. చట్టవిరుద్ధమైన హెల్మెట్ ఉపయోగించి పట్టుబడితే, ఏదైనా కొత్త నిబంధనలను పాటించడంలో విఫలమైతే, హెల్మెట్ కూడా జప్తు చేస్తారు.