schedule Sunday, July 05, 2026

పండగలకు సర్కారు ప్రాధాన్యం

calendar_today April 19, 2023
person dharshininews
పండగలకు సర్కారు ప్రాధాన్యం
పండగలకు సర్కారు ప్రాధాన్యం - రంజాన్‌ను సంతోషంగా జరుపుకోవాలి - తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ సర్కారు అన్ని వర్గాల పండగలకు ప్రాధాన్యమిస్తోందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రంజాన్ పండగ సందర్భంగా ముస్లిం సోదరులకు గిఫ్టుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాను అందజేశారు. మల్కాపూర్ గ్రామ ముస్లిం నేతలు ఎమ్మెల్యే చేతుల మీదుగా గిఫ్టులను అందుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల పండులకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. దసరాకు బతుకమ్మ చీరలు, క్రిస్మన్ కానుకలు, రంజాన్‌కు తోఫా అందిస్తూ సమన్యాయం చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా ముస్లిం రంజాన్ పండగ ఐక్యతకు నిదర్శనమని అన్నారు. ఈ పండగను అందరు సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ హసన్ పటేల్, బీసీ సెల్ అధ్యక్షులు ఆర్సీ చందుగౌడ్, అంతారం సర్పంచ్ రాములు, కరణ్‌కోట్ ఉపసర్పంచ్ హేమంత్ కుమార్, మాజీ ఎంపీటీసీ రఘునాథ్ రెడ్డి, యూత్ అధ్యక్షులు రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.