మైనార్టీల సంక్షేమానికి కృషి
April 19, 2023
dharshininews
మైనార్టీల సంక్షేమానికి కృషి
- తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
- ముస్లింకు రంజాన్ తోఫా, ఇఫ్తార్ విందు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ సర్కారు కృషి చేస్తోందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని సమద్ ఫంక్షన్ హాల్‌లో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా(గిఫ్టులు) పంపిణీ, ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేశారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సర్కారు మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. రంజాన్ పండగను అందరు సంతోషంగా జరపుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, సీనియర్ నాయకులు శ్రీశైల్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, మైనార్టీ నాయకులు కమల్ అతహర్, అబ్దుల్ సలీం, కౌన్సిలర్ ముక్తార్ తదితరులు పాల్గొన్నారు.