schedule Sunday, July 05, 2026

అభ్యుదయ విశ్వగురువు బసవేశ్వరుడు

calendar_today April 23, 2023
person dharshininews
అభ్యుదయ విశ్వగురువు బసవేశ్వరుడు
అభ్యుదయ విశ్వగురువు బసవేశ్వరుడు - సామాజిక సమానత్వానికి కషి చేసిన మహనీయుడు - బసవ జయంతిని దేశ వ్యాప్తంగా నిర్వహించాలి - జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి తాండూరు, దర్శిని ప్రతినిధి: సమాజంలో కుల వ్యవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన విశ్వగురువు మహాత్మ బసవేశ్వరుడు అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. సోవవారం బసవ జయంతిని పురస్కరించుకుని బీసీ సంఘం ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. పట్టణంలోని తాండూర్ పట్టణంలో వీరశైవ సమాజం సముదాయం నందు ఏర్పాటుచేసిన మహాత్మ బసవేశ్వరుని విగ్రహానికి బీసీ సంఘం కన్వినర్ రాజ్ కుమార్‌తో పాటు పలువురు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ లింగాయత్ సమాజ వ్యవస్థాపకుడు కన్నడ భక్తుడు విప్లవకారుడు సమాజంలో కుల వ్యవస్థను వర్ణబేదాలను లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది విశ్వగురు బసవేశ్వరుడు అని అన్నారు. 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు స్థాపించిన అనుభవ మండపం ఇప్పటి పార్లమెంట్ తరహాలో ఉండేదని గుర్తుచేశారు. అక్కడ అన్ని రకాల కులాలు, జాతులు తమ సమస్యలను వినిపించేవారు అన్నారు. అయితే దేవుడే దేవాలయం, శ్రమను మించిన సౌందర్యం లేదు అని, ఆహారం, ఇల్లు,, బట్ట జ్ఞానం, వైద్యం, ఇవి మానవుని కనీస హక్కులని చాటిన గొప్ప తత్వవేత్త బసవేశ్వరుడని అన్నారు. అంతటి మహనీయుని జయంతి ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా బసవేశ్వర సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసే విధంగా పాలకులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకుర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, యలాల్ మండల అధ్యక్షులు లక్ష్మణ చారి, సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజ్, బీసీ యువ నాయకులు రాము ముదిరాజ్, హరి ప్రసాద్, నర్సింలు, తాండ్ర నరేష్, నరసింహ, వెంకట్, శివ, శ్రీనివాస్, నర్సింలు మల్కయ్య తదితరులు పాల్గొన్నారు.