schedule Sunday, July 05, 2026

ప్లీనరీని పండగలా చేద్దాం రండి..!

calendar_today April 24, 2023
person dharshininews
ప్లీనరీని పండగలా చేద్దాం రండి..!
ప్లీనరీని పండగలా చేద్దాం రండి..! - ప్రతి మండలం నుంచి భారీగా తరలిరావాలి - తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ - బీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్ల పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సాధనకే ఉద్భవించిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తరువాత తొలిసారి నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశాన్ని పండగలా జరుపుకుందామని తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ పిలుపునిచ్చారు. మంగళవారం తాండూరు నియోజకవర్గ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాన్ని యాలాల మండలం లక్ష్మీనారాయణ పూర్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సోమవారం తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ రాష్ట్ర నాయకులు విజయ్ కుమార్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, యాలాల మండల ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గార్లతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ ప్లీనరీలో బీఆర్ఎస్ పార్టీ సాధించిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు పార్టీ భవిష్యత్ కార్యాచరణ పై తీర్మానాలను చేయడం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవతరణ తరువాతన నిర్వహిస్తున్న తొలి ప్లీనరీ సమావేశాన్ని పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అనుంబంధ కమిటీల నాయకులు సభ ఒక కుటుంబ వాతావరణంగా, ఒక పండగ వాతావరణంలా జరుపుకుందామన్నారు. ఇందుకోసం నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి నాయకులు సైనికుల్లా భారీ ఎత్తున తరలి వచ్చి సభను విజవంతం చేయాలని కోరారు.