schedule Monday, July 06, 2026

బీఆర్ఎస్‌కే జై కొట్టిస్తాం..!

calendar_today April 27, 2023
person dharshininews
బీఆర్ఎస్‌కే జై కొట్టిస్తాం..!
బీఆర్ఎస్‌కే జై కొట్టిస్తాం..! - సీఎం ప్రోత్సహాంతో స్పీడుగా కారు జోరు - ఎమ్మెల్యేతో పాటు ప్రతినిధుల సభ ఆహ్వానం గౌరవప్రదం - జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కే అందరు జై కొట్టేలా.. మళ్లీ సర్కారుకే అధికార పగ్గాలు దక్కేలా రాజీలేని కృషి చేస్తామని వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రతినిధుల సభకు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రతినిధుల సభలో తాండూరు నుంచి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు తనకు ఆహ్వానం దక్కడం గౌరవ ప్రదంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రసంగం ఉత్సహాం.. ఉత్తేజం నింపిదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలో రావడం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేయడం పార్టీ ప్రతినిధులకు కొండంత ధైర్యం ఇచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ కోరిన విధంగా కారు స్పీడు పెంచుతామన్నారు. నిత్యం ప్రజల్లో ఉండి పార్టీ గెలుపుకోసం నిరంతరం కృషి చేస్తామన్నారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుని బీఆర్ఎస్‌కు జై కొట్టించేలా కార్యాచరణ చేపడుతామని పేర్కొన్నారు.