schedule Saturday, September 05, 2026

మరో మూడు రోజులు వర్షాలు

calendar_today May 1, 2023
person dharshininews
మరో మూడు రోజులు వర్షాలు
మరో మూడు రోజులు వర్షాలు - వడగండ్లు కురిసే చాన్స్ - ప్రకటించిన వాతావరణ శాఖ హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడా, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి అనిశ్చితి కొనసాగుతోందని వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక రాష్ట్రాల్లో ఉరుములు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఓ ప్రకటనలో పేర్కొంది.