schedule Monday, July 06, 2026

ప్రియాంక గాంధీ పర్యటనకు తరలిరండి

calendar_today May 6, 2023
person dharshininews
ప్రియాంక గాంధీ పర్యటనకు తరలిరండి
ప్రియాంక గాంధీ పర్యటనకు తరలిరండి - యువ సంఘర్షణ సభను జయప్రదం చేద్దాం - కాంగ్రెస్ తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: హైదరాబాద్‌ పర్యటనకు విచ్చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రియాంక గాంధీ పర్యటనకు పార్టీ శ్రేణులు తరలి రావాలని ఆ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ శనివారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ నెల 8న హైదరాబాద్‌లోని సరూర్ నగర్ స్టేడియంలో సాయంత్రం 3 గంటలకు కాంగ్రెస్ యువ సంఘర్షణ సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సభలో పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ పాల్గొంటున్నారని చెప్పారు. ఈ పర్యటనకు తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గానికి చెందిన సీనీయర్ నేతలు, నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ, అనుబంధ సంఘాల నాయకులు, మహిళ నేతలు, కార్యకర్తలు, యువకులు భారీగా తరలిరావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే యువ సంఘర్షణ సభను జయప్రదం చేద్దామన్నారు. మరోవైపు హైదరాబాద్‌ సరూర్‌ నరగ్‌ స్టేడియంలో జరిగే యువ సంఘర్షణ సభా వేదికగానే ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారన్నారు. ఇది కూడా చదవండి.. పట్నం వారి పెళ్లి సందడి..! - వైభవంగా మనీషా రెడ్డి నిశ్చితార్థం - కాబోయే వధూరులకు ఆశీర్వాదాల వెల్లువ https://dharshininews.com/16923