schedule Tuesday, September 22, 2026

అర్హులైన పేదలకే క్రమబద్దీకరణ పట్టాలు

calendar_today May 7, 2023
person dharshininews
అర్హులైన పేదలకే క్రమబద్దీకరణ పట్టాలు
అర్హులైన పేదలకే క్రమబద్దీకరణ పట్టాలు - జీఓ 58, 59లతో అర్హులకు భరోసా - తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి - క్రమబద్ధీకరణ పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : అర్హులైన పేదలకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా క్రమబద్దీకరణ పట్టాలను అందజేయడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీఓ 59 కింద వివాదాలు లేని భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టాలను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పేదల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ఇందులో జీఓ 58, 59లు పేదలకు ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు. వివాదాలు లేని భూముల్లో నివాసాలు ఏర్పరుచుకున్న లబ్ధిదారులకు అట్టి భూములను క్రమబద్దీకరించి అందించడం జరుగుతుందన్నారు. ఇంకా భూముల క్రమబద్ధీకరణకు అవకాశం ఉన్న లబ్దిదారులు ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తులు సమర్పించాలని, అర్హులైన పేదలకు క్రమబద్ధీకరణ పట్టాలను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, శ్రీనివాస్ చారి, బీఆర్ఎస్‌ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), కౌన్సిలర్ విజయాదేవి, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి... మహిళను కాటేసిన ఎలుక - రూ. 60 వేల పరిహారం చెల్లింపుకు ఆదేశం - ఐదేళ్ల తరువాత వినియోదారుల కమీషన్ తీర్పు https://dharshininews.com/16968