schedule Monday, July 06, 2026

మైనార్టీలకు పైలెట్ పెద్దపీట

calendar_today May 9, 2023
person dharshininews
మైనార్టీలకు పైలెట్ పెద్దపీట
మైనార్టీలకు పైలెట్ పెద్దపీట - అభివృద్ధికి నిధులు మంజూరు హర్షణీయం - తాండూరు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ హసన్ పటేల్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలోని మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి స్థానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ తాండూరు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ హసల్ పటేల్ అన్నారు. మంగళవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మండలంలోని మైనార్టీల కోసం నిధులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. 40 ఏండ్లలో మొదటి సారి రోహిత్ రెడ్డి చొరవతో భారీగా నిధులు మంజూరు కావడం అభినందనీయమన్నారు. మండలంలోని ఈద్గాలు, స్మశాన వాటికల అభివృద్ధితో పాటు కమ్యూనీటి హాల్‌ నిర్మాణానికి నిధులు కేటాయింపు చేయడం గర్వకారణమన్నారు. తాండూరు మండలంలో దాదాపు రూ. 1.15 కోట్లను మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని అన్నారు. ఇది కూడా చదవండి.... హైఓల్టేజీ తంటా..! - 50 ఇండ్లలో కాలిపోయిన గృహోపకరణాలు - తాండూరు పట్టణంలో సంఘటన - విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమన్న బాధితులు https://dharshininews.com/17023