schedule Monday, July 06, 2026

జేపీఎస్‌ల సమ్మెకు బ్రేక్...!

calendar_today May 14, 2023
person dharshininews
జేపీఎస్‌ల సమ్మెకు బ్రేక్...!
జేపీఎస్‌ల సమ్మెకు బ్రేక్...! - తాండూరు మండల కార్యదర్శుల సమ్మె విరమణ - రేపటి నుంచి విధులకు హాజరవుతున్నట్లు ప్రకటన తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెకు బ్రేక్ ఇచ్చారు. రేపటి నుంచి విధుల్లో చేరేందుకు సన్నద్దమయ్యారు. గత 16 రోజులుగా చేపడుతున్న సమ్మెను విరమించి నేటి నుంచి విధులకు హాజరువుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వ ఆదేశాలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్. రావుతో మర్యాదపూర్వకంగా బేటి డిమాండ్లపై చర్చించగా సానుకూలంగా స్పందించినట్లు పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. దీంతో సమ్మెను విరమించి విధుల్లో చేరుతున్నట్లు తాండూరు మండల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రకటించారు. రేపటి నుంచి విధుల్లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఇది కూడా చదవండి... హాఫ్ షర్ట్, టీ షర్టుతో బైకు నడిపితే..! - వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు - కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే..? https://dharshininews.com/17144