schedule Saturday, September 05, 2026

అడ్మిషన్స్‌ స్టార్ట్‌..!

calendar_today May 15, 2023
person dharshininews
అడ్మిషన్స్‌ స్టార్ట్‌..!
అడ్మిషన్స్‌ స్టార్ట్‌..! - నేటి నుంచి ఇంటర్ ప్రవేశాలు - జూన్ 1 నుంచే తరగతుల ప్రారంభం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణలో ఇంటర్‌ ప్రవేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలను స్వీకరించడం జరుగుతుందని బోర్డు అధికారులు వెల్లడించారు. విద్యార్ధులు ఆన్‌లైన్‌ విధానంలో అధికారిక వెబ్‌సైట్లలో www.acadtsbie.cgg.gov.in, www.tsbie.cgg.gov.in దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే విద్యార్ధులు ప్రవేశాలు పొందాలని తెల్పుతూ వాటి జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్‌తో పాటు తరగతుల ప్రారంభానికి కూడా ప్రణాళికలను ప్రకటించింది. వచ్చే నెల జూన్‌ 1 నుంచి తరగతులు ప్రారంచించాలని స్పష్టం చేసింది. జూన్‌ నెల 30వ తేదీలోపు ప్రవేశాలు పూర్తి చేయాలని తెలిపారు. పదో తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగి చేసుకోవాలని సూచించారు. ఇది కూడా చదవండి... హాఫ్ షర్ట్, టీ షర్టుతో బైకు నడిపితే..! - వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు - కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే..? https://dharshininews.com/17144