schedule Monday, September 21, 2026

మృతుని కుటుంబంపై మానవత్వం

calendar_today May 15, 2023
person dharshininews
మృతుని కుటుంబంపై మానవత్వం
మృతుని కుటుంబంపై మానవత్వం - కుటుంబానికి సాయం అందించిన నాయకులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : మృతుని కుటుంబం పట్ల తాండూరు మండల బీఆర్ఎస్ నాయకులు మానవత్వం చాటుకున్నారు. కుటుంబానికి ఆర్థిక చేయూతను అందించారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన మంతటి రాజు అనే వ్యక్తి అనారోగ్యంతో కన్నుమూశాడు. సోమవారం ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్‌ తాండూరు మండల బీసీ సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షేక్ హసన్‌ పటేల్‌తో కలిసి మృతునికి కుటుంబానికి రూ. 5వేల సహాయం అందజేశారు. వారి వెంట తుల్జప్ప, రుద్రప్ప, శ్యామప్ప తదితరులు ఉన్నారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ విజయలక్ష్మీ పండరి కూడా గ్రామ ఉపసర్పంచ్ అబ్దుల్ మాజీద్ చేతుల మీదుగా రూ. 3 వేలు అందజేశారు. సర్పంచ్‌తో పాటు కార్తికేయన్ రూ. 1వెయ్యి, మైనోద్దీన్ రూ. 500లు వ్యక్తిగతంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ కాశినాథ్, మైనోద్దీన్, మొగులప్ప, ఉశనప్ప, అంజిలప్ప, శ్యామప్ప, రుద్రప్ప తదితరులు పాల్గొన్నారు.