schedule Monday, July 06, 2026

వార్డు అభివృద్ధికి కృషి

calendar_today May 22, 2023
person dharshininews
వార్డు అభివృద్ధికి కృషి
వార్డు అభివృద్ధికి కృషి - పీపుల్స్ ముందు నుంచి బీటీ రోడ్డు - పనులు పరిశీలించిన కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేయడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ పరిధి 25వ వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్‌ గౌడ్ అన్నారు. పట్టణంలోని మల్లప్ప మడిగ పీపుల్స్ కాలేజీ ముందు నుంచి చంద్రథియేటర్ వరకు రూ. 35 లక్షలతో బీటీ రోడ్డు మంజూరయ్యింది. సోమవారం నుంచి పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులను వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వార్డులో ప్రజల మౌళిక వసతుల కల్పనకు దృష్టిసారిస్తున్నామన్నారు. వార్డుకు మంజూరైన నిధులతో పీపుల్స్ కాలేజీ ముందు నుంచి చంద్రథియేటర్ సమీపం వరకు బీటీ రోడ్డు పనులను వేగవంతం చేయించడం జరిగిందన్నారు. త్వరలోనే రోడ్డు పనులు నాణ్యతంగా పూర్తి చేయించేలా కృషి చేస్తామన్నారు. ఇది కూడా చదవండి... స్కూల్లో బ్రేక్‌ ఫాస్ట్..! - సర్కారు బడులలో అమలు - వచ్చే ఏడాది నుంచి కొత్త మెను https://dharshininews.com/17189 chaithany collage