schedule Monday, July 06, 2026

ఎమ్మెల్సీది గారడి అభివృద్ధి

calendar_today May 25, 2023
person dharshininews
ఎమ్మెల్సీది గారడి అభివృద్ధి
ఎమ్మెల్సీది గారడి అభివృద్ధి - పైలెట్‌ రోహిత్ రెడ్డితోనే తాండూరు ప్రగతి - ఎమ్మెల్యేను విమర్శించడం తగదు - బీఆర్ఎస్ యువనాయకులు ఇంతియాజ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారడి అభివృద్ధి చేస్తే.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దశ దిశను మార్చారని స్థానిక బీఆర్ఎస్ యువనాయకులు ఇంతియాజ్ బాబా అన్నారు. గురువారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి అభివృద్ధి చేయలేకపోయారని అన్నారు. ప్రొసిడింగ్ లలోనే అభివృద్ధి పనులను చూపిస్తూ గారడి అభివృద్ధి చేశారని విమర్శించారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎప్పుడు పలకరిచింది లేదన్నారు. తాండూరు అభివృద్ధిని విస్మరించి షాబాద్ ప్రాంతానికి ప్రాధాన్యమిచ్చారని అన్నారు. తాండూరులో తన శకం కోల్పోతున్నారని భయంతో ఉనికి కోసం మీడియా సమావేశాల్లో విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ విషయాలన్ని ప్రజలు గమనిస్తున్నరని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నాలుగేళ్లలోనే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు రూపురేఖలు, దశ దిశలు మార్చారని అన్నారు. తాండూరులో ప్రధానంగా ఉన్న బైపాస్ రోడ్డును దశల వారిగా పూర్తి చేయడమే కాకుండా పట్టణంలోని ప్రధాన రోడ్ల అభివృద్ధికి నిధులు తెచ్చిన ఘనత రోహిత్ రెడ్డికే దక్కుతుందన్నారు. కేవలం రెండేళ్లలో ఇంత అభివృద్ధి చేసారంటే రాబోయే రోజుల్లో మరింత ప్రగతి సాధిస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై విమర్శలు చేయడం తగదన్నారు. ఇప్పటికైనా స్థాయి దిగజారకుండా పెద్దతనం నిలబెట్టుకోవాలని అన్నారు. ఇది కూడ చదవండి... టిక్కెట్టుపై రాద్ధాంతమెందుకు..? - వచ్చే ఎన్నికల్లో రోహిత్‌ రెడ్డే పోటీ - 50 వేల బంపర్ మెజార్టీ ఖాయం - పార్టీకి నమ్మక ద్రోహం చేసింది ఎమ్మెల్సీనే https://dharshininews.com/17356 chaithany collage