schedule Monday, July 06, 2026

సద్గురు సాయినాథ్ మహారాజ్‌కీ జై..!

calendar_today May 27, 2023
person dharshininews
సద్గురు సాయినాథ్ మహారాజ్‌కీ జై..!
సద్గురు సాయినాథ్ మహారాజ్‌కీ జై..! - ఘనంగా శ్రీషిర్డిసాయిబాబా దేవాలయ వార్షికోత్సవ వేడుకలు - పూజలు నిర్వహించిన నర్సింహారెడ్డి (బాబు) తాండూరు, దర్శిని ప్రతినిధి : సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై.. అంటూ సాయినాథుని నామ స్మరణతో తాండూరు పట్టణం కోకట్ రోడ్డుమార్గంలోని షిర్డి సాయి బాబా దేవాలయం మార్మోగింది. శనివారం షిర్డి సాయిబాబా దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో వెలసిన సాయిబాబాకు అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకలకు పట్టణ భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఉదయం మేలుకొలుపు, మధ్యాహ్న హారతి, దూపహారతి వంటి కార్యక్రమాలు కనులపండుగల జరిగాయి. వార్షికోత్సవ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ సోదరుడు, స్వర్గీయ హోంమంత్రి ఇంద్రారెడ్డి ట్రస్ట్ చైర్మన్, తాండూరు సిటికేబుల్ ఎండి నర్సింహారెడ్డి(బాబు) దంపతులు ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొన్నారు. మరోవైపు ఆలయంలో ఏర్పాటు చేసిన భజన కార్యక్రమంలో సాయి కీర్తనలు అలరించాయి. సాయినాథుని నామస్మరణతో ఆలయం మార్మొగింది. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటి సభ్యులు భక్తులకు అన్నదాన(మహాప్రసాదము) కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు, సాయి భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడ చదవండి... పట్నం ఇంటికి పైలెట్..! - ఇరువర్గాలలో జోరుగా చర్చలు - రాజకీయ పరిణాలపై మాటామంతి https://dharshininews.com/17369 chaithany collage