schedule Saturday, July 04, 2026

రేషన్‌కు హెల్ప్‌ లైన్..!

calendar_today May 29, 2023
person dharshininews
రేషన్‌కు హెల్ప్‌ లైన్..!
రేషన్‌కు హెల్ప్‌ లైన్..! - మీ కోటా ఇవ్వకుంటే కంప్లైట్ చేయొచ్చు - తూకంలో మోసాలపై ఫిర్యాదుకు అవకాశం దర్శిని డెస్క్‌: దేశంలోని అర్హులైన పేదలకు ప్రభుత్వం రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తోంది. రేషన్ షాపులను నిర్వహించే డీలర్లు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. అర్హులైన వారికి రేషన్ ఇవ్వకపోవడం, లేదంటే తూకంలో మోసం చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇదే విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇలాంటి చర్యల పట్ల ప్రభుత్వాలు సీరియస్‌గా ఉన్నాయి. రేషన్ విషయంలో డీలర్లు ఏదైనా ఇబ్బందులకు గురి చేయడం, మోసానికి పాల్పడటం వంటివి చేస్తే వెంటనే కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా ప్రచారం చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే.. ప్రతి రాష్ట్రానికి ప్రభుత్వం రేషన్ హెల్ప్‌లైన్ నంబర్‌ను జారీ చేసింది. ఈ నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. కంప్లైంట్ వచ్చిన వెంటనే అధికారులు చర్యలు తీసుకుంటారు. ఎలా కంప్లైట్ చేయాలంటే..? రాష్ట్రానికి అనుగుణంగా ఆన్‌లైన్‌లో హెల్ప్‌లైన్ నంబర్‌లు ప్రకటించారు. ఇందుకోసం, అధికారిక వెబ్‌సైట్ https://nfsa.gov.in/ను సందర్శించవచ్చు. ఇక్క ఆయా రాష్ట్రాల హెల్ప్‌లైన్ నంబర్‌ల లిస్ట్ ఉంటుంది. ఈ నంబర్‌లకు కాల్ చేయడం ద్వారా సమస్య గురించి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత సంబంధిత డీలర్‌పై విచారణ జరుపుతారు. తప్పు తేలితే, డీలర్‌షిప్ క్యాన్సిల్ చేయడమే కాకుండా.. జరిమానా విధించడం, జైలు శిక్ష విధించడం కూడా జరుగుతుంది. రాష్ట్రాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్‌లివే.. ఆంధ్రప్రదేశ్: 1800-425-2977 అరుణాచల్ ప్రదేశ్: 03602244290 అస్సాం: 1800-345-3611 బీహార్: 1800-3456-194 ఛత్తీస్‌గఢ్: 1800-233-3663 గోవా: 1800-233-0022 గుజరాత్: 1800-233-5500 హర్యానా: 1800-180-2087 హిమాచల్ ప్రదేశ్: 1800-180-8026 జార్ఖండ్: 1800-345-6598, 1800-212-5512 కర్ణాటక: 1800-425-9339 కేరళ: 1800-425-1550 మధ్యప్రదేశ్: 181 మహారాష్ట్ర: 1800-22-4950 మణిపూర్: 1800-345-3821 మేఘాలయ: 1800-345-3670 మిజోరం: 1860-222-222-789, 1800-345-3891 నాగాలాండ్: 1800-345-3704, 1800-345-3705 ఒడిషా: 1800-345-6724 / 6760 పంజాబ్: 1800-3006-1313 రాజస్థాన్: 1800-180-6127 సిక్కిం: 1800-345-3236 తమిళనాడు: 1800-425-5901 తెలంగాణ: 1800-4250-0333 త్రిపుర: 1800-345-3665 ఉత్తర ప్రదేశ్: 1800-180-0150 ఉత్తరాఖండ్: 1800-180-2000, 1800-180-4188 పశ్చిమ బెంగాల్: 1800-345-5505 ఢిల్లీ: 1800-110-841 జమ్మూ: 1800-180-7106 కాశ్మీర్: 1800-180-7011 అండమాన్ & నికోబార్ దీవులు: 1800-343-3197 చండీగఢ్: 1800-180-2068 chaithany collage