అన్నదాతల కన్నెర్ర..!
May 30, 2023
dharshininews
అన్నదాతల కన్నెర్ర..!
- ధాన్యం అన్ లోడింగ్ పై ఆందోళన
- రోడ్డెక్కి గంటల పాటు నిరసన
- రైతులకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని అన్నదాతలు కన్నెర్ర చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి తరలించిన ధాన్యం అన్ లోడింగ్ చేయడం లేదని ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనకు కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన మంగళవారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఖాంజాపూర్ గేటు గోదాంల సమీపంలో చోటు చేసుకుంది. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, పెద్దేముల్ మండలాల నుంచి కొనుగోలు కేంద్రాల నుంచి తూకం చేసిన ధాన్యం బస్తాలను ఖాంజాపూర్ గేటు గోదాంలో నిల్వ చేసేందుకు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఇక్కడ అన్ లోడింగ్ సక్రమంగా జరగడం లేదు. దీంతో గోదాం లోపల, రోడ్డు బయట దాదాపు 200 ట్రాక్టర్లు, డీసీఎంలు బారులు తీరాయి. గత నాలుగు రోజుల నుంచి రైతులు కష్టాలు పడుతున్నారు. మంగళవారం ఉదయం రైతులు సమస్య పరిష్కరించాలని రొడ్డెక్కి ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనతో హైదారాబాద్ రోడ్డు మార్గంలో రాకపోకలు స్తంభించాయి. తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్ని చేశారు. అదేవిధంగా ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ టీపీసీసీ ఉపాధ్యక్షులు, తాండూరు ఇంచార్జ్ ఎం. రమేష్ మహారాజ్, టీపీపీసీ ప్రధాన కార్యదర్శి, జడ్పీటీసీ ధారాసింగ్, నాయకులతో కలిసి రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గోదాంలో ధాన్యం బస్తాల నిల్వకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. గోదాంలో అధికారులు సమయానికి రాకపోవడంతో అవస్థలు పడాల్సి వస్తుందన్నారు. మధ్యాహ్నాం వచ్చి సాయంత్రానికి వెళ్లిపోవడంతో ధాన్యం అన్ లోడింగ్ కాక రాత్రింబవుళ్లు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంట్రాక్టర్ కేవలం 18 నుంచి 20 మంది కార్మికులతోనే అన్ లోడింగ్ చేయిస్తున్నారని అన్నారు.
అధికారులు స్థానికంగా ఉండి.. కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా టీపీపీపీ ఉపాధ్యక్షులు రమేష్ మహరాజ్, ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ లు మాట్లాడుతూ రైతులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గోదాం వద్ద ఉన్నతాధికారులను నియమించి.. కార్మికులను పెంచాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. రైతుల కష్టాలపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం విడ్డూరమని విమర్శించారు. రైతుల ధాన్యాన్ని వెంట వెంటనే అన్ లోడింగ్ చేయించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు, నేతలు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జనార్ధన్ రెడ్డి, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి...
సూపర్ స్టార్‌తో పైలెట్..!
- రజనీకాంత్ ఇంటికి వెళ్లిన రోహిత్ రెడ్డి భేటీ
- గృహప్రవేశానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే
https://dharshininews.com/17449