schedule Monday, July 06, 2026

ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చర్యలు

calendar_today May 30, 2023
person dharshininews
ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చర్యలు
ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చర్యలు - రైతులు గ్రామాల్లోని కేంద్రాలకే ధాన్యం తరలించాలి - తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడు - ఇంచార్జ్, కాంట్రాక్టర్‌లకు ఆదేశాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడు అన్నారు. మంగళవారం ఖాంజాపూర్ గేటు సమీపంలోని గోదాం వద్ద రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై తహసీల్దార్ చిన్నప్పల నాయుడు స్పందించి వడ్ల కొనుగోలు ఇంచార్జ్ వెంకట్రామ్ రెడ్డి, కాంట్రాక్టర్ బల్వంత్ రెడ్డిలతో మాట్లాడారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ కు మించి అధికంగానే ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని వారు వివరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. మరోవైపు రైతులు కూడా గ్రామాల్లో కేటాయించిన కొనుగోలు కేంద్రానికే ధాన్యం తరలించాలని సూచించారు. నేరుగా గోదాం వద్దకు తీసుకవచ్చి ఇబ్బందులు పడొద్దన్నారు. ఇప్పటికే గోదాం పూర్తిగా నిండిపోయిందని, ఒక్క బస్తా కూడా లోడింగ్ చేసే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాజిరెడ్డి తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి... సూపర్ స్టార్‌తో పైలెట్..! - రజనీకాంత్ ఇంటికి వెళ్లిన రోహిత్ రెడ్డి భేటీ - గృహప్రవేశానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే https://dharshininews.com/17449 chaithany collage