schedule Monday, July 06, 2026

ప్రగతి ప్రతిబింబించేలా దశాబ్ది ఉత్సవాలు

calendar_today May 31, 2023
person dharshininews
ప్రగతి ప్రతిబింబించేలా దశాబ్ది ఉత్సవాలు
ప్రగతి ప్రతిబింబించేలా దశాబ్ది ఉత్సవాలు - అట్టహాసంగా రాష్ట్ర అవతరణ వేడుకలు - తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి - తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రతిభింబించేలా.. దశాబ్ది ఉత్సవాలను జరుపుకోవాలని.. అన్ని చోట్ల అవతరణ వేడుకలు అట్టహాసంగా నిర్వహించాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం తాండూరు పట్టణం దుర్గా గ్యాండూర్ హాల్ లో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో తెలంగాణ రాష్ట్ర అవరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రా న్ని సాధించుకోవడం జరిగిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై దశాబ్ది కాలం అవుతున్న నేపథ్యంలో సర్కారు అవతరణ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ఇందులో భాగంగా దశాబ్ది ఉత్సవాలను చారిత్రాకంగా జరుకుందామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రోజూ వారి కార్యక్రమాలలో రాష్ట్ర ప్రగతి ప్రతిభింభించేలా ఉత్సవాలను నిర్వహించాలన్నారు. ఈ ఉత్సవాలలో ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. బంగారు తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి సీఎం కేసీఆర్ కు అందరు తోడ్పాటు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్కృ చైర్మన్ రాజుగౌడ్, తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్, డీఎస్పీ శేఖర్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... డెడ్‌ బాడీపై అఘోరా పూజలు - స్నేహితుడి అంత్యక్రియల్లో ఘటన https://dharshininews.com/17476 chaithany collage