schedule Monday, July 06, 2026

తనయుని కోసం తపన..!

calendar_today May 31, 2023
person dharshininews
తనయుని కోసం తపన..!
తనయుని కోసం తపన..! - రినీష్ రెడ్డి క్రికెట్‌ టోర్నమెంట్‌ల నిర్వహణలో జోష్‌ - ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి - తాండూరు, యాలాల మండలాల్లో సందర్శన తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర మాజీ రవాణా శాఖ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తన తనయుని పట్ల తపను కనబరిచారు. తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కుమారుడు పట్నం రినీష్‌ రెడ్డి యువత కోసం గురువారం నుంచి నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ కోసం జోష్ నింపారు. ఇందులో భాగంగా బుధవారం తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో, యాలాల మండలం రాఘవపూర్‌ గ్రామంలోని మైదానాలను సందర్శించారు. ఆయా గ్రామాలలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రదేశాలను ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి దగ్గరుండి పరిశీలించారు. క్రికెట్ టోర్నమెంట్ లో పోటీలకు అన్ని ఏర్పాట్లపై నిర్వహకులతో సమీక్షించారు. క్రీడాకారులకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఎమ్మెల్సీ వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, వీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సిద్రాల శ్రీనివాస్, నాయకులు మసూద్, బీదర్ రాజశేఖర్, బల్వంత్ రెడ్డి, మహిపాల్, పాండు, కోఆప్షన్ సభ్యులు శంషోద్దీన్, యువ నాయకులు బిర్కడ్ రఘు, కోట్ల రాజ్ కుమార్, ఇర్ఫాన్, సర్పంచుల సంఘం అధ్యక్షులు మేఘనాథ్ గౌడ్, రాజు, హరీశ్వర్ రెడ్డి, లాల్ రెడ్డి, ఎంపీటీసి రాము, అశోక్ కుమార్ తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి... డెడ్‌ బాడీపై అఘోరా పూజలు - స్నేహితుడి అంత్యక్రియల్లో ఘటన https://dharshininews.com/17476 chaithany collage