schedule Monday, July 06, 2026

ఆర్టీసీ ఉద్యోగులకు కానుక

calendar_today June 1, 2023
person dharshininews
ఆర్టీసీ ఉద్యోగులకు కానుక
ఆర్టీసీ ఉద్యోగులకు కానుక - దశాబ్ది ఉత్సవాల వరంగా డీఏ - ఎంత శాతం మంజూరు చేస్తుందంటే హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం కానుక ఇవ్వబోతోంది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సంతోష పడే కానుకను అందించనుంది. రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులకు మరో విడత కరువు భత్యం (డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌లు వెల్లడించారు. జులై 2022లో ఇవ్వాల్సి ఉన్న 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ నెల జీతంతో కలిపి డీఏను ఉద్యోగులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. 2011లో దాదాపు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం కృషి చేశారు. ఆ తరుణంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా పెండింగ్‌లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఉద్యోగులకు సంస్థ ఏడు డీఏలను మంజూరు చేసిందని తెలిపారు. ఇప్పుడు మిగిలిఉన్న ఒక్క డీఏను సైతం త్వరలోనే ఉద్యోగులకు రానుందని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి... మహిళా సంఘాలకు గుడ్‌ న్యూస్‌ - రూ.15,037 కోట్ల రుణాలకు సర్కారు ఆమోదం - గత యేడాది కంటే రూ.2315 కోట్లు అధికం https://dharshininews.com/17490 chaithany collage