schedule Saturday, July 04, 2026

త్వరలో నా పెళ్లి..!

calendar_today June 1, 2023
person dharshininews
త్వరలో నా పెళ్లి..!
త్వరలో నా పెళ్లి..! - నేను జైలుకు వెళ్లనంటే వెళ్లను - కోర్టులో రిమాండ్‌ ఖైదీ హంగామా - కోర్టులోనే తలుపు అద్దాలు ధ్వసం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : నేను జైలుకు వెళ్లనంటే వెళ్లను.. త్వరలోనే నాకు పెళ్లి ఉంది వదిలేయమంటూ ఓ రిమాండ్ ఖైదీ నానా హంగామా చేశారు. కోర్టులోనే వీరంగం చేస్తూ తలుపు అద్దాలను ధ్వంసం చేశాడు. ఉద్రిక్తత సృష్టించిన ఈ సంఘటన హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ నగరానికి చెందిన ఆనంద్‌ అగర్వాల్‌ చేసిన నేరాలకు గాను అతనిపై పోలీసులు రౌడీషీట్ నమోదు చేశారు. దొంగతనం, గంజాయి, హత్య కేసులతో పాటు 18 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. ఇటీవల ఓ గంజాయి కేసులో శాలిబండ పోలీసులు ఆనంద్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాలను పరిశీలించిన న్యాయస్థానం కేసు విచారణ కోసం నిందితుడికి రిమాండ్ విధించింది. ఈ విషయం విన్న నిందుడుతు ఆనందర్ అగర్వాల్ తనకు ఇటీవలే పెళ్లి కుదిరిందని ఈనెల 25 న జరగనుందని చెప్పాడు. జైలుకు వెళ్లనంటు మొండికేశాడు. ఈ క్రమంలోనే కోపంతో కోర్టు లోపల ఉన్న డోర్ అద్దాలు ధ్వంసం చేశాడు. ఎలాగోలా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా నిందితుడు అయినా ఆనంద్‌ నెల క్రితమే ఓ హత్య కేసులో అతను జైలుకెళ్లి విడుదల కావడం గమనార్హం. ఇది కూడా చదవండి... మహిళా సంఘాలకు గుడ్‌ న్యూస్‌ - రూ.15,037 కోట్ల రుణాలకు సర్కారు ఆమోదం - గత యేడాది కంటే రూ.2315 కోట్లు అధికం https://dharshininews.com/17490 chaithany collage