schedule Saturday, July 04, 2026

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేధిస్తున్నాడని..!

calendar_today June 2, 2023
person dharshininews
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేధిస్తున్నాడని..!
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేధిస్తున్నాడని..! - ఢిల్లీ తెలంగాణ భవన్‌ వద్ద యువతి ఆత్మహత్యాయత్నం - స్పందించి ఆసుపత్రికి తరలించిన సిబ్బంది దర్శిని డెస్క్‌: బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ యువతి దేశ రాజధాని ఢిల్లిలోని తెలంగాణ భవన్‌ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆరిజిన్‌ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్‌ పనిచేస్తున్నారు. అయితే శేజల్‌ను గత కొంతకాలంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు చేస్తోంది. మానసికంగా , లైంగికంగా ఎమ్మెల్యే వేధిస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం దిల్లీలోని మహిళా కమిషన్‌, హెచ్‌ఆర్సీని కలిసి ఫిర్యాదు కూడా చేసింది. భారాసకు చెందిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తూ.. చంపుతానని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టించి భయాందోళనలకు గురిచేస్తున్నారని తెలిపారు. దీనిపై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఫిర్యాదులో వేడుకున్నారు. తాజాగా ఢిల్లీ తెలంగాణ భవన్‌ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన తెలంగాణ భవన్‌ సిబ్బంది ఆమెను ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రికి తరలించారు. ఇది కూడా చదవండి... త్వరలో నా పెళ్లి..! - నేను జైలుకు వెళ్లనంటే వెళ్లను - కోర్టులో రిమాండ్‌ ఖైదీ హంగామా - కోర్టులోనే తలుపు అద్దాలు ధ్వసం https://dharshininews.com/17509 chaithany collage