schedule Saturday, July 04, 2026

రేషన్ డీలర్ల సమ్మె విరమణ

calendar_today June 7, 2023
person dharshininews
రేషన్ డీలర్ల సమ్మె విరమణ
రేషన్ డీలర్ల సమ్మె విరమణ - ప్రారంభమైన రేషన్ పంపిణీ - ఊపిరి పీల్చుకున్న సామాన్యులు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: దీర్ఘ కాలిక డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు వెళ్లిన రేషన్ డీలర్లు సమ్మెను విరమించుకున్నారు. పౌరసరఫరల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో రేషన్ డీలర్ల సంఘం జరిపిన చర్చలు ఫలించాయి. రేషన్ డీలర్లు.. కమీషన్ పెంపు, గౌరవ వేతనం అమలు వంటి 22 డిమాండ్ల కోసం గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నారు. .......... సోమవారం నుంచి రాష్ట్రంలోని 17,284 రేషన్‌ దుకాణాలను మూసివేసి సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్‌తో రేషన్ డీలర్ల జేఏసీ నాయకులు మంగళవారం చర్చలు జరిపారు. సాయంత్రం 6 గంటల తరువాత సమావేశం ముగియగా, చర్చలు సఫలమైనట్లు డీలర్లు ప్రకటించారు. జూలై లోపు తమ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్న నమ్మకం ఉందని, గౌరవ వేతనం, ఇన్సూరెన్స్‌ అంశాలు సీఎం కేసీఆర్ పరిధిలో ఉన్నందున సమ్మెను విరమించి, రేషన్‌ దుకాణాలు తెరుస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు రేషన్ డీలర్లు సమ్మే విరమించి దుకాణాలు తెరిచారు. మంగళవారం సాయంత్రం నుంచే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ చేయడం ప్రారంభించారు. దీంతో నెలరేషన్‌పై ఆందోళనకు గురైన సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17631 లోకల్‌ యాడ్స్ కోసం కింద చూడండి..