schedule Saturday, July 04, 2026

స్కూల్‌ అకాడమిక్ క్యాలెండర్ విడుదల

calendar_today June 7, 2023
person dharshininews
స్కూల్‌ అకాడమిక్ క్యాలెండర్ విడుదల
స్కూల్‌ అకాడమిక్ క్యాలెండర్ విడుదల - ప్రతి నెల పిల్లలకు నో బ్యాగ్‌ డే - పనిదినాలు, సెలవులు ఎన్ని రోజులంటే.? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు కాగా.. ముందుగా అనుకున్నట్లే జూన్ 12 నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభం కానుంది. అలాగే వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 24వ తేదీని చివరి పనిదినంగా నిర్ణయించారు. ఈసారి దసరా సెలవులను 14 రోజుల నుంచి 13 రోజులకు కుదించారు. అక్టోబర్ 14 నుంచి 25 వరకు ఈ సెలవులు ఉండనున్నాయి. క్రిస్మస్‌ సెలవులను కూడా ఏడు నుంచి అయిదుకు తగ్గించారు. జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. ప్రతి నెల మూడో శనివారం పేరెంట్‌, టీచర్‌ మీటింగ్‌ నిర్వహించాలి. ప్రతి నెల మొదటి వారంలో పాఠశాల విద్యా కమిటీ సమావేశాలు జరగాలి. ఇక నాలుగో శనివారం నో బ్యాగ్‌ డే రోజూ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనుంది పాఠశాల విద్యాశాఖ. నో బ్యాగ్‌ డేలో భాగంగా పిల్లలకు పుస్తకాల నుంచి విముక్తి.. రోజంతా ఆటపాటలు ఉండనున్నాయి. అటు వారానికి 3 నుంచి 5 పీరియడ్లు ఆటలు తప్పనిసరి చేశారు. రోజూ 30 నిమిషాల పాటు పుస్తకాలు చదివడంతో పాటు.. 5 నిమిషాల పాటు పిల్లలతో యోగా, ధ్యానం చేయించాలని నిర్ణయించింది. 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకాడమిక్‌ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ పాఠశాల విద్యాశాఖ. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17642 లోకల్‌ యాడ్స్ కోసం కింద చూడండి..