schedule Monday, September 21, 2026

చిలుకవాగు అభివృద్ధిపై దృష్టి

calendar_today June 13, 2023
person dharshininews
చిలుకవాగు అభివృద్ధిపై దృష్టి
చిలుకవాగు అభివృద్ధిపై దృష్టి - రూ. 10.50లక్షలతో మరమ్మత్తులు - తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్  రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి 13 వ వార్డులోని చిలుకవాగు అభివృద్ధిపై దృష్టి సారించడం జరుగుతుందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం 13వ వార్డులోని చిలుక వాగు మరమ్మత్తుల పనులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వార్డు కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డితో పాటు ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ వర్షకాలంలో 13వ వార్డులోని ప్రజలకు చిలుక వాగు నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకుని రూ. 10.50లక్షలను చిలుకవాగు మరమ్మత్తులకు కేటాయించడం జరిగిందన్నారు. చిలుకవాగు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం), వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17834 chaithany collage