schedule Monday, July 06, 2026

పొలింగ్ కేంద్రాలపై నజర్..!

calendar_today June 15, 2023
person dharshininews
పొలింగ్ కేంద్రాలపై నజర్..!
పొలింగ్ కేంద్రాలపై నజర్..! - సదుపాయాలు, సౌకర్యాలపై దృష్టి - పరిశీలించిన తహసీల్దార్ చిన్నప్పల నాయుడు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించడంతో ప్రభుత్వ అధికారులు ఆ దిశగా చర్యలకు సిద్దమవుతున్నారు. వికారాబాద్‌ జిల్లాలోని రెవెన్యూ అధికారులు ఓటర్ల నమోదు, బోగస్‌ ఓటర్ల తొలగింపునకు చర్యలు చేపడుతున్నారు. తాజాగా పొలింగ్ కేంద్రాలపై నజర్‌ పెట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం తాండూరు మండలంలో తహసీల్దార్ చిన్నప్పల నాయుడు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. మండలంలోని సంగెంకలాన్, కొత్లాపూర్, మల్కాపూర్, జినుగుర్తి, సంకిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లోని పాఠశాలల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎన్నికల నిర్వహణలో తీసుకునే చర్యలు, సౌకర్యాలు, సదుపాయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు ప్రాంతంలో మొత్తం 117 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఇందులో మండలానికి సంబంధించి 50 కేంద్రాలు, తాండూరు పట్టణానికి సంబంధించి 67 కేంద్రాలు ఉన్నాయని వెల్లడించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రాలను సందర్శించడం జరిగిందన్నారు. కేంద్రాల్లో సౌకర్యాలు లేకుండా అందుకు తగ్గ ఏర్పాట్లపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. పరిశీలించిన నివేధికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. ఆయన వెంట ఆయా గ్రామాల పెద్దలు, సిబ్బంది ఉన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17893 chaithany collage