schedule Monday, July 06, 2026

తాండూరులో రినీష్ రెడ్డి సందడి

calendar_today June 17, 2023
person dharshininews
తాండూరులో రినీష్ రెడ్డి సందడి
తాండూరులో రినీష్ రెడ్డి సందడి - పీఎంఆర్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ వీక్షణ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునితా రెడ్డిల వారసుడు పట్నం రినీష్ రెడ్డి సందడి చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పీఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు రినీష్ రెడ్డి హాజరయ్యారు. మ్యాచ్ లో తలపడుతున్న వార్డు నెంబర్ 7 జట్టును వార్డు నెంబర్ 29వ వార్డు జట్టుకు శుభాకాంక్షలు తెలిపి మ్యాచ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, నాయకులు మసూద్ యువనాయకులు బిర్కడ్ రఘు, రొంపల్లి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17969 chaithany collage