schedule Tuesday, September 22, 2026

ఉత్సహాంగా హరితోత్సవం

calendar_today June 19, 2023
person dharshininews
ఉత్సహాంగా హరితోత్సవం
ఉత్సహాంగా హరితోత్సవం - మొక్కలు నాటిన చైర్ పర్సన్, అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తాండూరులో హరితోత్సవం ఉత్సహంగా జరిగింది. సోమవారం పట్టణంలోని వైట్ ప్యాలెస్ నుంచి పాల శీతల కేంద్రం వరకు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కమీషనర్ శంకర్ సింగ్, కౌన్సిలర్లు అందరు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పచ్చదనానికి పెద్దపీట వేసిందన్నారు. ఇందులో భాగంగా ప్రతియేడాది హరితహారం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెంచేందుకు కృషి చేస్తుందన్నారు. అడవుల శాతాన్ని, పచ్చదనం పెంపొందిస్తూ ప్రజా ఆరోగ్యానికి శ్రద్ధ వహిస్తుందన్నారు. అందరు మొక్కలు వాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల, కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, బోయ రవి, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ రంగనాథం, ఏఈ ఖాజా హుస్సేన్, శానిటరీ ఇనస్పెక్టర్ ఉమేష్ కుమార్, ఎన్విరాల్ మెంట్ ఇంజనీర్ ప్రవీన్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17991 chaithany collage