schedule Monday, July 06, 2026

రైతులకు శుభవార్త..!

calendar_today June 19, 2023
person dharshininews
రైతులకు శుభవార్త..!
రైతులకు శుభవార్త..! - రైతుబంధు విడుదలపై కీలక ప్రకటన - డబ్బులు జమ చేయాలని ఆదేశించిన సీఎం కేసీఆర్ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు డబ్బుల జమపై కీలక సూచన చేశారు. ఈనెల 26న రైతు బంధు నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆరోజు నుంచే అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఈ నిధులు జమ చేయనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే తొలకరి జల్లులు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వానకాలం పెట్టుబడి కింద రైతు బంధు నిధులు జమ చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు త్వరలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. పట్టాల పంపిణీ అనంతరం పోడు రైతులకు కూడా రైతు బంధు వర్తించేలా చూస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17997 chaithany collage