schedule Sunday, September 20, 2026

calendar_today June 20, 2023
person dharshininews
గిరిజన కులవృత్తిదారులకు సాయం ప్రకటించాలి - అనిల్‌ రాథోడ్‌ యువసేన అధ్యక్షులు అనిల్‌ రాథోడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : గిరిజన కులవృత్తి దారులకు ఆర్థిక సాయం ప్రకటించాలని అనిల్‌ రాథోడ్ యువసేన తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు అనిల్ రాథోడ్ మంగళవారం ఓప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ కులవృత్తిదారులకు ఆర్థిక సాయం కింద రూ. 1లక్ష అందజేస్తుందని అన్నారు. అదే తరహాలో గిరిజన కుల వృత్తిదారులకు కూడా రూ.1లక్ష ఆర్థిక సాయం ప్రకటించాలన్నారు. గిరిజనుల్లో కూడా కులవృత్తితో జీవనం సాగిస్తున్న పేదలు ఉన్నారని గుర్తుచేశారు. సరైన ఆర్థిక పరిస్థితులు లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ గిరిజన వృత్థిదారులకు కూడా ఆర్థిక సాయం ప్రకటించాలని కోరారు. ఇది కూడా చదవండి..... https://dharshininews.com/18021 chaithany collage