schedule Monday, July 06, 2026

మూడు రోజులు నీళ్లు రావు..!

calendar_today June 24, 2023
person dharshininews
మూడు రోజులు నీళ్లు రావు..!
మూడు రోజులు నీళ్లు రావు..! - రేపటి నుంచి మిషన్‌ భగీరథలో అంతరాయం - ఎందుకోసమో.. ప్రకటించిన అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని పలు మండలాలతో పాటు తాండూరు పట్టణంలో మూడు రోజులు నీళ్ల సరఫరా నిలిచిపోతుందని అధికారులు ప్రకటించారు. 25వ తేది ఆదివారం నుంచి ఈనెల 27వ తేది వరకు మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని తాండూరు మున్సిపల్ డీఈ రంగనాథం తెలిపారు. శనివారం ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. పరిగి నుంచి తాండూరుకు సరఫరా అయ్యే మిషన్ భగీరథ 900 - ఎంఎం పైపులైన్ లీకేజీ కారణంగా ఈ మూడు రోజులు పాటు తాగునీరు సరఫరా ఉండదని వెల్లడించారు. ధారూర్, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్, తాండూరు. మండలాలతో పాటు తాండూరు పట్టణంలో సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. 28వ తేది నుంచి మళ్లీ తాగునీరు సరఫరా యధావిధిగా ఉంటుందని చెప్పారు. కావున ప్రజలు తాగునీరు పొదుపుగా వాడుకోవాలని, సమీపంలోని బోర్ల నుంచి నీటి అవసరాలను తీర్చుకోవాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/18082 chaithany collage