schedule Monday, July 06, 2026

బీఆర్ఎస్ అభ్యర్థులు రెడి..!

calendar_today June 25, 2023
person dharshininews
బీఆర్ఎస్ అభ్యర్థులు రెడి..!
బీఆర్ఎస్ అభ్యర్థులు రెడి..! - వారం రోజుల్లో ప్రకటన - ఎన్నికలకు సిద్దమవుతోన్న గులాబీ బాస్ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణలో ఎన్నికల వేడి వేగం పెంచుకుంది. రాష్ట్రంలో హ్యాట్రిక్‌ కొట్టడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్షాల ఊహకందని రీతిలో.. పక్కా ప్లాన్‌తో.. ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహించిన సీఎం కేసీఆర్. ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు ముందే అభ్యర్థులను ప్రకటించేలా కేసీఆర్‌ కసరత్తు చేశారు. వారం, పది రోజుల్లోనే.. అందరు అభ్యర్థులను ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. అప్పటిలాగానే ఇప్పుడు కూడా వారం, పదిరోజుల్లో.. మొత్తం 119 మంది అభ్యర్థులను ప్రకటించనున్నారు గులాబీ బాస్‌. ఇంకా ఈ సారి కూడా ఎలాంటి పొత్తులు లేకుండానే.. సింగిల్‌గానే ఎన్నికలకు వెళ్లేందుకు కేసీఆర్‌ ప్లాన్‌ చేశారు. అలానే.. 80 నుంచి 90 శాతం సిట్టింగ్స్‌కే అవకాశం కల్పిస్తున్నారు. ఇక 8 నుంచి 15 మందిని మార్చే ఛాన్స్‌ ఉంది. సర్వేల ఆధారంగా గులాబీ బాస్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అన్నిపార్టీల కంటే ముందుగానే ఎన్నికల అభ్యర్థులను ప్రకటించడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఎప్పుడన్నా ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున.. ముందుగానే అభ్యర్థుల జాబితాను రెడీ చేశారు. వారం, పది రోజుల్లోనే.. మొత్తం అభ్యర్థులను ప్రకటించేందుకు గులాబీ బాస్‌ సిద్ధమవుతున్నారు. 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌.. ప్రభుత్వ రద్దు ప్రకటనతో పాటే.. అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించారు. అప్పుడు ఎన్నికలకు మూడు నెలల ముందే.. ఒకేసారి 105 మంది జాబితాను విడుదల చేయడం సంచలనం సృష్టించింది. మరోవైపు బీఆర్‌ఎస్‌ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశమున్న నేతల జాబితా సిద్ధంగా ఉందని.. వారిని వీలైనంత వరకూ బుజ్జగించడానికి.. లేకపోతే.. వెళ్లిపోయినా ప్రభావం లేకుండా చేయడానికి కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/18086 chaithany collage