schedule Sunday, September 20, 2026

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పైలెట్ భరోసా

calendar_today June 26, 2023
person dharshininews
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పైలెట్ భరోసా
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పైలెట్ భరోసా - నివాసాలకు వెళ్లి పరామర్శించిన రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి భరోసా అందించారు. తాండూరు పట్టణానికి చెందిన బీఆర్ఎస్, సీనియర్ నాయకులు, వీరతైన సమాజం అధ్యక్షులు ఆర్. బస్వరాజ్ కుమారుడు సంతోష్ కుమార్ ఇటీవలే కన్నుమూశారు. అదేవిధంగా పట్టణానికి చెందిన బీఆర్ఎస్ బీసీ సెల్ కార్యదర్శి చంటి యాదవ్ సహోదరుడు, ఆర్ఎంపీ వైద్యులు గంగాధర్ కూడా ఇటీవల కన్నుమూశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆర్.బస్వరాజ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా చంటి యాదవ్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా అందించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/18131 chaithany collage