schedule Monday, July 06, 2026

మైనార్టీలకు ఎమ్మెల్యే వ్యతిరేకం కాదు

calendar_today June 27, 2023
person dharshininews
మైనార్టీలకు ఎమ్మెల్యే వ్యతిరేకం కాదు
మైనార్టీలకు ఎమ్మెల్యే వ్యతిరేకం కాదు - పైలెట్ రోహిత్ రెడ్డిపై దుష్ర్పచారం చెయొద్దు - ఖండించిన మైనార్టీ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి: మైనార్టీల సంక్షేమానికి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కృషి చేస్తున్నారని, ఆయన మైనార్టీలకు వ్యతిరేకం కాదని మున్సిపల్ మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం తాండూరు పట్టణం ఇందిరానగర్‌లోని 4వ వార్డు కౌన్సిలర్ అస్లాం, ఉర్దూఘర్ మాజీ చైర్మన్ అబ్దుల్ సలీం తదితరులు మీడియాతో మాట్లాడారు. తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మైనార్టీల సంక్షేమానికి, అభివృద్దికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈద్గాలు, మసీదుల అభివృద్ధికి నిధులు కేటాయించారని అన్నారు. ప్రభుత్వ పథకాలలో కూడా మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఆయనకు లభిస్తున్న ఆధరణను ఓర్వలేక కొందరు దుష్ర్ర్పచారం చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముస్లిం, మైనార్టీలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని ప్రచారం చేస్తున్నా వాఖ్యలను వారు ఖండించారు. అలాంటి దుష్ర్ర్పచారాలను మైనార్టీ యువత, ప్రజలు నమ్మేది లేదన్నారు. మైనార్టీల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెంట మైనార్టీలు అండగా నిలుస్తారని, రానున్న రోజుల్లో ఆయన నాయకత్వాన్ని బలపరుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ అంజద్ ఖాన్, నాయకులు ఎండి ఎజాజ్, అక్రమ్, యూసుఫ్‌ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18169 chaithany collage