schedule Sunday, September 20, 2026

సాయిచంద్‌ మరణం రాష్ట్రాని తీరనిలోటు

calendar_today June 29, 2023
person dharshininews
సాయిచంద్‌ మరణం రాష్ట్రాని తీరనిలోటు
సాయిచంద్‌ మరణం రాష్ట్రాని తీరనిలోటు - అతని ఆత్మకు శాంతి కలగాలి - అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఉద్యమ గాయకుడు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ మరణం రాష్ట్రానికి తీరని లోటు అని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. గాయకుడు సాయిచంద్‌ గుండెపోటుతో మృతి చెందటం చాలా బాధాకరమని సంతాపం తెలిపారు. గురువారం నిర్వహించిన అంతిమయాత్రలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు సాయిచంద్‌ భౌతికఖాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు. తెలంగాణ సాధనలో సాయిచంద్ పాట ఉద్యమం చిరస్మరణీయంగా నిలిచి ఉంటుందని అన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18206 chaithany collage