schedule Sunday, September 20, 2026

బోడ్రాయి స్థాపనకు రండి..!

calendar_today July 2, 2023
person dharshininews
బోడ్రాయి స్థాపనకు రండి..!
బోడ్రాయి స్థాపనకు రండి..! -ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి ఆహ్వానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ నడిబొడ్డున ప్రతిష్టాపన చేసే మహోత్సవానికి రావాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని ఉత్సవ కమిటి సభ్యులు ఆహ్వానించారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని ఉత్సవ కమిటి సభ్యులు కలిశారు. ఈనెల 7వ తేది నుంచి 10వ తేదీ వరకు పట్టణంలోని భద్రేశ్వర చౌరస్తా ప్రాంతంలో బోడ్రాయి(నాభిశిల) ప్రతిష్టాపన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి వివరించారు. ఈ ఉత్సవాలకు రావాలని ఎమ్మెల్సీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉత్సవాలకు తమవంతు సహాకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటి సభ్యులు బిర్కడ్ నారాయణ, అలంపల్లి సిద్ధు, భాస్కర్, కృష్ణ, భీమప్ప, బిర్కడ్‌ శివ, నర్సింలు, దోమ శ్రీము, నర్సింహా, బిర్కడ్‌ రఘు, ఈశ్వర్, పట్నం రాజు, తలారి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18280 chaithany collage