schedule Monday, July 06, 2026

సేవే ధ్యేయంగా పనిచేయాలి

calendar_today July 2, 2023
person dharshininews
సేవే ధ్యేయంగా పనిచేయాలి
సేవే ధ్యేయంగా పనిచేయాలి - లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాధాకృష్ణ - అట్టహాసంగా తాండూరు లయన్స్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం తాండూరు, దర్శిని ప్రతినిధి : లయన్స్ క్లబ్ కీర్తి ప్రతిష్టలు పెంచడంతో పాటు సేవే ధ్యేయంగా పనిచేయాలని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ గవర్నర్ రాధాకృష్ణ అన్నారు. ఆదివారం పట్టణంలోని సల్లా గార్డెన్ లో తాండూరు లయన్స్ క్లబ్ 49వ నూతన కార్యవర్గం(2023-24) ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ గవర్నర్ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలో లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా వై. బసనప్ప, కార్యదర్శిగా మహమ్మద్ యూసుఫ్, కోశాధికారిగా పి.మల్లారెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలన్నారు. విద్యా, వైద్యం, సామాజిక రంగాలతో పాటు అన్ని రంగాల్లో సేవా కార్యక్రమాలను చేపట్టాలన్నారు. మరోవైపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న తాండూరు: పట్టణంకు చెందిన అశోక్ అనే వ్యక్తికి రెండు నెలలకు సరిపడా మందులు, శిశుమందిర్ పాఠశాల విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఆర్థిక సాయం, యాలాల మండలం అంగన్ వాడి స్కూల్ కు టీవీ, ఎంసెట్ లో స్టేట్ 2 ర్యాంకు సాధించిన విద్యార్థికి ఆర్ధిక సాయం, పట్టణంలోని విజయ విద్యాలయ స్కూల్ విద్యార్థులకు బ్యాగుల పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులు బసనప్ప, సల్లా దామోదర్, గోపాలకృష్ణ, బి.శ్రీధర్, వీర ప్రసాద్, స్వర్గీయ భద్రణలు సహాకారంతో పై సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో లయన్ క్లబ్ సభ్యులు సల్లా దామోదర్, ఓం ప్రకాష్ సోమాని, చంద్రశేఖర్, మాజీ అధ్యక్షులు జహీర్ అహమ్మద్, కార్యదర్శి రొంపల్లి సంతోష్ కుమార్, కోశాధికారి మహమ్మద్ యూసుప్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18288